లోకేష్​ తో గంటా, తారక రత్నల భేటీ

By udayam on January 10th / 12:36 pm IST

హైదరాబాద్​ పర్యటనలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ తో ఆ పార్టీ సీనియర్​ నేత గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. గత కొంత కాలంగా టిడిపి కి దూరంగా ఉంటున్న గంటా.. లోకేష్​ తో భేటీపై సర్వత్రా ఆశక్తి పెరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్ లోని లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ భేటీ అనంతరం లోకేష్​ ను నందమూరి తారక రత్న కలిశారు.

ట్యాగ్స్​