మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానంటూ జరుగుతున్న వార్తలపై నటుడు తారక రత్న స్పందించాడు. ఈ మూవీలో తాను నటించడం లేదని, ఈ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని అతడు వెల్లడించాడు. అంతకు ముందు తారకరత్న ఈ మూవీలో నటిస్తున్నాడంటూ ప్రచారం జోరుగా జరిగింది. దీనిని తారకరత్న పిఆర్ టీమ్ ఖండించింది. దీంతో మహేష్ మూవీలో తారక రత్న నటించడం లేదని తేలింది.