హవాలా సొమ్ము స్వాధీనం

By udayam on November 21st / 5:48 am IST

హైదరాబాద్‌: మొన్ననే భాగ్య నగరంలో హవాలా సొమ్ము స్వాధీనం చేసుకోగా తాజాగా మరో హవాలా గుట్టు రట్టయ్యింది. మల్లేపల్లి దగ్గర రూ.18.65 లక్షలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాచిగూడకు చెందిన బిపిన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్‌ పోలీసులకు నిందితుడిని వెస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. ఈ సొమ్ము ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాన్ని  దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

కాగా అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు నిర్వహించి, బంగారం తరలిస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిని దుబాయ్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 4 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.