టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ముంబైలో అత్యంత ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ముంబైలోని పెడ్డర్ రోడ్ లగ్జరీ టవర్‌లో డుప్లెక్స్ ఫ్లాట్‌ను ఆయన కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని జస్లోక్ ఆసుపత్రి వద్ద నిర్మించిన 28 అంతస్తుల ఈ హైటెక్ భవంతిలో ఆయన గత ఐదేళ్ళుగా లీజ్‌కు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు అదే బిల్డింగ్‌లోని 11, 12 అంతస్తులను కలుపుతూ కట్టిన 6 వేల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్‌ను ఆయన రూ.98 కోట్లకు కొనుగోలు చేశారు.