న్యూజెర్సీ కంపెనీ దక్కించుకున్న టిసిఎస్​

By udayam on November 13th / 2:45 pm IST

ప్రముఖ టెక్నాలజీ సంస్థ టిసిఎస్​ న్యూజెర్సీకి చెందిన ఐర్లాండ్​ టెక్నాలజీ కంపెనీ ప్రమెరిక సర్వీసెస్​ను కొనుగోలు చేసింది. ప్రుడెన్షియల్​ ఫైనాన్షియల్​ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ కంపెనీని టిసిఎస్​ ఎంతకు కొనుగోలు చేసిందో ఇంకా తెలియరాలేదు.

ఈ కొనుగోలు మొత్తం షేర్ల రూపంలోనే జరుగుతోందని, డబ్బులు చేతులు మారే అవకాశం లేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టిసిఎస్​ ఉద్యోగి వెల్లడించినట్లు ప్రముఖ ఆన్​లైన్​ వార్తా సంస్థ వైర్​ వెల్లడించింది.

అయితే కంపెనీలోని 1500 మంది ఉద్యోగులు ఇకపై టిసిఎస్​ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్​పై ఇప్పటికే ఇరు కంపెనీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై స్పందించడానికి టిసిఎస్​, ప్రుడెన్షియల్​ కంపెనీలు నిరాకరించాయి. ఇప్పటికే డచ్​ బ్యాంక్​ కు చెందిన టెక్నాలజీ సర్వీసెస్​ యూనిట్​ పోస్ట్​బ్యాంక్​ సిస్టమ్స్​ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న టిసిఎస్​ ఇప్పుడు మరో విదేశీ కంపెనీని హస్తగతం చేసుకున్నట్లయింది.

దీంతో 2023 కు కంపెనీకి 750 మిలియన్​ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.