ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార సంస్థ బిస్లరీని అమ్మనున్నట్లుగా ఆ కంపెనీ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. వ్యాపర నిర్వహణపై తన కుమార్తె జయంతి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సహా మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన చెప్పారు. అయితే టాటా గ్రూప్ తో రూ. 7 వేల కోట్లకు డీల్ ఓకే అయిందని వస్తోన్న వార్తలను రమేశ్ చౌహాన్ ఖండించారు.కేవలం కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన బిస్లరీ.. ఇప్పుడు రూ.7000 కోట్లకు విస్తరించింది.