భారత్ లో ఐఫోన్ల తయారీకి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందు కోసం దేశీయ దిగ్గజ సంస్థ టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగుళూరుకు చెందిన విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లో మెజారిటీ వాటా దక్కించుకునేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తోంది. విస్ట్రోన్ – టాటా మధ్య ఒప్పందం కుదిరితే టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఐఫోన్ల తయారీ జరిగే అవకాశముంది.