5:20 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

బిగ్​ బాస్కెట్​లోకి టాటా పెట్టుబడులు! 2 weeks ago

ఉప్పు నుంచి లగ్జరీ కార్లు, టెక్నాలజీ కంపెనీల వరకూ అన్ని రంగాలలోనూ తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్​ తాజాగా కిరాణాలోకి సైతం అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు గానూ భారత్​లోని ప్రముఖ రిటైల్​ కంపెనీ బిగ్​ బాస్కెట్​లో దాదాపు 200 మిలియన్​ డాలర్లు అంటే దాదాపు 1500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు మార్కెట్లో వార్తలు వస్తున్నాయి.

‘‘టాటా గ్రూప్​, టెమసేక్​ అండ్​ జనరేషన్​ ఇన్వెస్ట్​మెంట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలు బిగ్​బాస్కెట్​లో మైనారిటీ వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ వాటా విలువ దాదాపు 200 మిలియన్​ డాలర్ల వరకూ ఉంటుంది. దీంతో బిగ్​ బాస్కెట్​ మరింత వేగంగా విస్తరించడానికి వీలు కలుగుతుంది” అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిగ్​బాస్కెట్​ ఉద్యోగి వెల్లడించారు.

కొవిడ్​ – 19 సమయంలో ఎవరూ దుకాణాలకు వెళ్ళి కొనుగోలు చేయడానికి ఇష్టపడని సమయంలో బాగా లాభపడ్డ కంపెనీ బిగ్​ బాస్కెట్​. దీంతో ఇప్పుడు మార్కెట్​ దిగ్గజ కంపెనీల దృష్టి బిగ్​బాస్కెట్​ పై పడింది. ఈ పెట్టుబడులతో టాటా గ్రూప్​ ఆన్​లైన్​ రిటైల్​ వ్యాపారానికి పెద్ద ముందడుగు అనే చెప్పాలి.

దీనిపై టాటా సన్స్​ ఛైర్మన్​ నటరాజన్​ చంద్రశేఖరన్​ మాట్లాడుతూ ‘‘ఇదొక సూపర్​ యాప్​. మాకు ఇదొక మంచి అవకాశంగా కనిపిస్తోంది” అని ఫైనాన్షియల్​ టైమ్స్​తో వ్యాఖ్యానించారు. బిగ్​ బాస్కెట్​ యాప్​లో ఫుడ్​, గ్రోసరీ, ఫ్యాషన్​, లైఫ్​ స్టైల్​, ఎలక్ట్రానిక్స్​, ఇన్స్యూరెన్స్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​, ఎడ్యుకేషన్​, హెల్త్​కేర్​, బిల్​ పేమెంట్స్​ కూడా ఉన్నాయని చంద్రశేఖరన్​ తెలిపారు.