కందుకూరి తొక్కిసలాట: మృతుల అంత్యక్రియలకు టీడీపీ ఎమ్మెల్యేలు

By udayam on December 29th / 9:05 am IST

టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మరణించిన 8 మంది కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రోజంతా కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఉండి మనోధైర్యం కల్పించాలని సూచించారు. మృతులకు ఆర్థికసాయం వెంటనే అందజేయాలన్నారు. కాగా, నేడు కందుకూరులో అన్ని కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

ట్యాగ్స్​