నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న చంద్రబాబు నాయుడు పర్యటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు టిడిపి రూ.25 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు జరిపిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు.. అనంతరం వారి కుటుంబాలను పలకరించిన మీదట ఈ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచారు. పార్టీ నుంచి రూ.15 లక్షలు.. పార్టీ నేతలు మరో రూ.10 లక్షలు చొప్పున అందించనుండడంతో ఆ మొత్తం రూ.25 లక్షలకు చేరింది.