చంద్రబాబు: పాఠశాలల వరకూ గంజాయి ఎలా వస్తోంది

By udayam on October 4th / 7:04 am IST

టిడిపి అధినేత చంద్రబాబు విజయవాలో పాఠశాలకు వెళ్లే బాలికలు గంజాయి తాగినట్టు మీడియాలో వచ్చిన కథనంపై స్పందించారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచిందని వెల్లడించారు. ఈ వార్త తనను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టి పెట్టాలని, సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్​