5న ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రం నుంచి ఫోన్​..

By udayam on November 23rd / 11:05 am IST

టిడిపి అధినేత చంద్రబాబు డిసెంబర్‌ 5 న న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి అధ్యక్షతన జరగనున్న రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు. జి-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5 న సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది. భారత్‌లో నిర్వహించే జి-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ట్యాగ్స్​