ఇటీవల తాను జరిపిన కర్నూలు పర్యటనకు వచ్చిన స్పందన చూసే వైకాపా నాయకత్వంలో గుబులు రేగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత భారీ స్పందన ఎప్పుడూ చూడలేదని అన్నారు. దాంతో, వైఎస్‌ఆర్‌సిపిలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే రాష్ట్రంలో 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌సిపి ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు.