చంద్రబాబు : ఓడిపోతే ఇవే నా చివరి ఎన్నికలవుతాయ్​

By udayam on November 17th / 5:48 am IST

వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పత్తిపాడు గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ నాయకుడినైన నన్ను, నా భార్యను అసెంబ్లీలో అవమానించారు. ఆరోజే ఒక నిర్ణయం తీసుకున్నా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెట్టాలని. లేకపోతే అసెంబ్లీకి రాకూడదని. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే… ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపించాలి. లేదా ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’ అని ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

ట్యాగ్స్​