మంత్రి అంబటి రాంబాబుపై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూ అడిగిన ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను మంత్రి రాంబాబు లైంగికంగా వేధించారన్న వార్త సిఎం పేషీకి కూడా చేరిందని అయ్యన్న ట్వీట్లో రాసుకొచ్చారు. త్వరలో రాంబాబును భర్తరఫ్ కూడా చేయనున్నారని పేర్కొన్నారు. ‘ఇంటర్వ్యూ ఇస్తే నాకేం ఇస్తావ్’ అంటూ రాంబాబు మాట్లాడినట్లు అయ్యన్న తన ట్వీట్లో పేర్కొన్నారు.