నెల్లూరు: కమిషనర్​ శివారెడ్డి ఇంటిని ముట్టడించిన తేదేపా శ్రేణులు

By udayam on December 26th / 12:44 pm IST

టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఈ ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీరు శివారెడ్డి కమిషనర్ ఇంటిని ముట్టడించారు. వైఎస్‌ఆర్‌సిపి ఫ్లెక్సీలను తొలగించకుండా… టిడిపి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏమిటని మండిపడ్డారు.

ట్యాగ్స్​
TDP