అవిశ్వాసంలో ఓడిన కాకినాడ మేయర్​

By udayam on October 5th / 10:52 am IST

కాకినాడ కార్పొరేషన్​ మేయర్​ పావని.. టిడిపి కార్పొరేటర్లు లేవనెత్తిన అవిశ్వాసంలో ఓడిపోయారు! ఆమెతో పాటు ఉప మేయర్​గా ఉన్న సత్తిబాబు కూడా ఈరోజు జరిగిన ఓటింగ్​లో ఓటమి పాలయ్యారు. మొత్తం 44 మంది కార్పొరేటర్లు ఉన్న ఈ కార్పొరేషన్​లో కోరం 31 మంది ఉండాల్సి ఉంది. మేయర్​కు వ్యతిరేకంగా ఎక్స్​ అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం కోర్టు కేసు ఉన్న నేపధ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్​ అధికారి రిజర్వ్​ చేశారు.

ట్యాగ్స్​