టిడిపి అధినేతతో గోరంట్ల భేటీ

By udayam on September 2nd / 11:25 am IST

ఇటీవల పార్టీని వీడతానంటూ అలకబూనిన రాజమండ్రి రూరల్​ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్​, జవహర్​లు సైతం చంద్రబాబుతో మీటింగ్​కు హాజరయ్యారు. గోరంట్లకు కలిగిన అసంతృప్తికి గల కారణాలు తెలుసుకునేందుకు ఇప్పటికే టిడిపి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.