బద్వేల్​లో పోటీ చేయం : టిడిపి

By udayam on October 4th / 5:36 am IST

ఎపిలోని బద్వేల్​లో జరగనున్న ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటికే జనసేన ఈ ఎన్నికల నుంచి తప్పుకోగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా పోటీని విరమించుకుంది. ఈ విషయాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భర్త మరణిస్తే ఆ స్థానం నుంచి భార్య నిలబడితే పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని టిడిపినే మొదలుపెట్టిందని అచ్చెన్నాయుడు తెలిపారు.

ట్యాగ్స్​