అవన్నీ అక్రమ అరెస్టులే అంటూ డీజీపికి లేఖ రాసిన చంద్రబాబు

By udayam on January 10th / 11:29 am IST

కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిలిపివేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. పోలీసులే ఫిర్యాదు దారులుగా టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని లేఖలో ఆరోపించారు. సెక్షన్ 307ను దుర్వినియోగం చేసి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సెక్షన్ 307 విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతోందని… కుప్పం, పుంగనూరు, మాచర్ల తదితర ప్రాంతాల్లో అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని చంద్రబాబు నాయుడు కోరారు.

ట్యాగ్స్​