క్లాసులో టీచర్ల డ్యాన్సులు.. సస్పెండ్​

By udayam on September 27th / 8:49 am IST

క్లాసురూమ్​లో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు ‘మైనూ లెహంగా’ అంటూ పాటలకు డ్యాన్సులు చేయడంపై ఉత్తర ప్రదేశ్​ ప్రభుత్వం సీరియస్​ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ కావడంతో టీచర్లందరినీ సస్పెండ్​ చేసింది. ఆగ్రాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో తీసిన ఈ వీడియోలో మొత్తం 5 గురు టీచర్లు డ్యాన్సులు చేయడం కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని ఈ ఏడాది మార్చి 21న తీసిందని హిందుస్థాన్​ టైమ్స్​ ప్రచురించింది. ఆ సమయంలో స్కూల్స్​ బంద్​ కావడంతో విద్యార్ధులెవరూ లేరని పేర్కొంది.

ట్యాగ్స్​