సినిమాలకు బ్రేక్​ : ఆ వార్తల్లో నిజం లేదట!

By udayam on December 21st / 4:43 am IST

సీనియర్​ హీరోయిన్​ సమంత సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటిస్తోందన్న వార్తలపై ఆమె టీం స్పందించింది. సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ఆమె ‘ఖుషీ’ మూవీ షూటింగ్​ లో తిరిగి పాల్గొననున్నారని వివరించారు. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. ఓ బాలీవుడ్ చిత్రం షూటింగులో జనవరి నుంచే పాల్గొనాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని సమంత ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్యాగ్స్​