బంగ్లాదేశ్ తో జరుగుతున్న 2వ టెస్ట్ లో నిన్న బౌలింగ్ లో రాణించిన భారత్.. నేడు బ్యాటింగ్ లోనూ దుమ్ముదులిపేశారు. 94 కే 4 వికెట్లు కోల్పోయిన భారత్ కు పంత్ 93, శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో ఆ తర్వాత భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది. మొత్తంగా 87 పరుగుల ఆధిక్యం వద్ద భారత్ 314 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ 4, తైజుల్ 4 వికెట్లు తీశారు. టస్కిన్ 1, మెహదీ హసన్ 1 వికెట్ తీశారు.