హైదరాబాద్​: లగ్జరీకారులో బాలికపై మైనర్ల అత్యాచారం

By udayam on June 3rd / 11:52 am IST

హైదరాబాద్​లోని జూబ్లీ హిల్స్​ ప్రాంతంలో ఓ మైనర్​ బాలికను 4 గురు వ్యక్తులు గ్యాంగ్​ రేప్​ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పార్టీకి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్న 17 ఏళ్ళ బాలికను మెర్సిడెజ్​ కారులోకి లాగి నలుగురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రేప్​ జరిగిన వాహనాన్ని సీజ్​ చేశారు. రేప్​ చేసిన వ్యక్తులు సైతం మైనర్లేనని పోలీసులు తెలిపారు. మే​ 28న జరిగిన ఈ ఘటనపై మూడు రోజుల క్రితమే కేసు నమోదైంది.

ట్యాగ్స్​