తెలంగాణ స్పీకర్​ పోచారం కు కరోనా

By udayam on November 25th / 9:45 am IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డికి ఈరోజు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను గడ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. మడు రోజుల క్రితం ఆయన తన మనవరాలి పెళ్ళిని దగ్గరుండి మరీ నిర్వహించారు. ఈ వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్​, వైఎస్​.జగన్​లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు.

ట్యాగ్స్​