వైరల్​ వీడియో : బండి సంజయ్​ కొడుకుపై క్రిమినల్​ కేసు

By udayam on January 18th / 11:13 am IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మీద పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఒక విద్యార్థిపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 323, 341, 541, 506 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. మంగళవారం నాడు వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని మహీంద్రా యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోలో సాయి భగీరథ్..శ్రీరామ్​ అనే అబ్బాయిని కొడుతూ కనిపించాడు. మధ్యలో సాయి భగీరథ్ స్నేహితుడు అని చెబుతున్న మరొక విద్యార్థి వచ్చి శ్రీరామ్‌ను కొట్టడమూ కనిపిస్తోంది.

ట్యాగ్స్​