25న హర్యానాకు కేసీఆర్​

By udayam on September 20th / 7:32 am IST

వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్​ అందులో భాగంగా ఈనెల 25న హర్యానాకు వెళ్ళనున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవిలాల్ జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న సిఎం ఈ వేదికపైనే సిఎంలు నితీష్​కుమార్​, మమతా బెనర్జీలను కలుసుకోనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ పాల్గొంటే మాత్రం ఆయన ఈ సభకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు.

ట్యాగ్స్​