ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలు అటవీ అధికారుల ఫై దాడులు చేస్తున్నారని.. వీరు దాడులు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అటవీ అధికారులు వాపోతున్నారు. మంగళవారం గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనివాసరావు అంత్యక్రియలకు మంత్రులు పువ్వాడ, ఇంద్రకిరణ్ లు హాజరయ్యారు. ఈ క్రమంలో అటవీ అధికారులు వారిని అడ్డుకున్నారు. గుత్తికోయల దాడుల నుంచి తమను రక్షించాలని వారంతా కోరుతూ ఆందోళకు దిగారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించారు.