టీకా పంపిణీపై అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

By udayam on January 12th / 11:19 am IST

హైదరాబాద్: తొలిదశ టీకా పంపిణీకి సంబంధించి వాక్సిన్ హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీతోపాటు పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.

టీకా పంపిణీపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని, ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తాయని గుర్తుంచుకోవాలని సూచించారు.

ప్రజాప్రతినిధులు యాక్టివ్‌గా ఉంటేనే అధికారులు అలసత్వం వహించరని, సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.