ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల సాయం

By udayam on October 12th / 10:43 am IST

తెలంగాణలో సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించడానికి సిద్ధమవుతోంది. ప్రతీ నియోజకవర్గంలో 1000 నుంచి 1500 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకానికి తుది రూపు ఇవ్వడానికి సిఎం కెసిఆర్​ సిద్ధమతున్నారు. ఈ పథకం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 10 వేల నుంచి 15 వేల మంది లబ్దిదారులకు మేలు చేకూర్చనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​