ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని తుర్కయంజల్ భూములను వేలం వేయనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ–వేల పద్దతిన ఈ భూములను అమ్మకానికి ఉంచనుంది. వ్యక్తులకు గానీ, ప్రైవేటు సంస్థలు కానీ ఈ భూముల్లో ప్లాట్స్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం ఇక్కడ 40 వేల స్క్వేర్ యార్డ్స్ భూమి అందుబాటులో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.