వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సైతం తెలంగాణ ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదని సియాసత్ రిపోర్ట్ చేసింది. దీనిపై ఇప్పటికే పలు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. రాష్ట్రం వద్ద నిధులు నిండుకుంటున్న వేళ కేంద్రం కొత్త అప్పులకు అంగీకారం చెప్పకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ సైతం ఓపెన్ మార్కెట్లో అప్పులు చేయడానికి తెలంగాణకు ఉన్న అనుమతిని ఈనెల 17న రద్దు చేసింది.