తెలంగాణలో ఉదయం 4 నుంచే షో లకు అనుమతి

By udayam on January 11th / 5:54 am IST

ఈ సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీలను విడుదలైన రోజు ఉదయం 4 గంటల నుంచే ప్రదర్శించుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ సమయాల్లో సాధారణంగా ఫ్యాన్స్​ కోసం బెనిఫిట్​ షోస్​ వేస్తుంటారు. అయితే ఈ బెనిఫిట్​ షో స్​ పై ఏపీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. బాలయ్య మూవీ వీర సింహారెడ్డి 12 (గురువారం)న, చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య 13 (శుక్రవారం) విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​