టిఎస్​: టికెట్​ రేట్లు పెంచుకోండి

By udayam on May 10th / 6:42 am IST

మహేష్​ బాబు, కీర్తి సురేష్​, పరశురామ్​ పెట్ల కాంబోలో తెరకెక్కిన సర్కారు వారి పాటకు.. తెలంగాణ సర్కార్​ తీపికబురు అందించింది. ఈ మూవీ టికెట్​ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12 నుంచి 18 వ తేదీ వరకూ అంటే 7 రోజుల పాటు ఈ మూవీ టికెట్​ రేట్ల పెంపునుకు అంగీకరించింది. అదే సమయంలో మొదటి వారం మొత్తం ఈ సినిమాను 5 షోలు వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. ధియేటర్ ను బట్టి టికెట్​పై రూ.50, రూ.30 వరకూ పెంచుకోవాలని సూచించింది.

ట్యాగ్స్​