రాజకీయాలకు హైకోర్టును వేదికగా చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. రాజకీయ అంశాలు బయట చూసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సిజె ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాం జి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అప్పీల్‌కు విచారణ అర్హత లేదని, క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి కాని, హైకోర్టులో ధర్మాసనం విచారణ జరపకూడదన్నారు.