మద్యం ధరల్ని పెంచిన తెలంగాణ

By udayam on May 19th / 6:32 am IST

తెలంగాణలో మద్యం ధరల్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీరు బాటిల్​పై రూ.10, క్వార్టర్​ లిక్కర్ (90 ఎంఎల్​) లిక్కర్​ సీసాపై రూ.20, 1000 ఎంఎల్​ లిక్కర్​ బాటిల్​పై రూ.120 వరకూ ధరల్ని పెంచేసింది. మొత్తంగా చూస్తే దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకూ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన మద్యం ధరలు గురువారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. బ్రాండ్​లను బట్టి పెంచిన ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది.

ట్యాగ్స్​