ఇంటర్​ 2వ సంవత్సరం పరీక్షలూ రద్దు

By udayam on June 9th / 7:26 am IST

తెలంగాణలో ఇంటర్​ రెండో సంవత్సరం పరీక్షలను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే ఫస్ట్​ ఇయర్​ పరీక్షల్ని రద్దు చేసిన విద్యాశాఖ తాజాగా 2వ సంవత్సరం విద్యార్థులకూ ఈ వెసులుబాటు కల్పించింది. సిబిఎస్​ఈ, ఐసిఎస్​ఈ బోర్డులు సైతం ఇంటర్​ పరీక్షల్ని రద్దు చేసిందని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈరోజు సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ప్రకటనను విడుదల చేయనుంది.

ట్యాగ్స్​