తెలంగాణకు 10 హైవేలు

By udayam on May 21st / 4:52 am IST

తెలంగాణలో మరో 10 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. హైదరాబాద్​ రీజనల్​ రింగ్​ రోడ్డులోని ఉత్తర భాగంతో పాటు, ఇటీవలే మంజూరైన నాగ్​పూర్​–విజయవాడల మధ్య గ్రీన్​ఫీల్డ్​ యాక్సెస్​ కంట్రోల్డ్​ హైవే కూడా వీటిల్లో ఉంది. మొత్తం 10 రోడ్ల నిడివి రాష్ట్రంలో 715 కి.మీ.లు ఉండనుంది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.28,615 కోట్లను ఖర్చు చేయనుంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ రాష్ట్రంలో 258 కి.మీ.ల రోడ్లకు శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్​