ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: మాకు కేసు వివరాలు ఇవ్వడం లేదు

By udayam on January 6th / 12:18 pm IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసు వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఇస్తే విచారణ ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది. కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. సీబీఐ వాదన కూడా వింటామంది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ట్యాగ్స్​