స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.4,200ల కోట్ల పెట్టుబడులను సంపాదించింది. మొబిలిటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బిఎఫ్ఎస్ఐ వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ‘ఈ ట్రిప్ ఎంతో ఉత్పాదకతను మిగిల్చింది. ఈ అద్భుతమైన పది రోజుల ట్రిప్‌ను మరిచిపోలేను’ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. మొత్తం 45 బిజినెస్ మీటింగ్‌లు జరిపిన కెటిఆర్, 4 రౌండ్ టేబుల్స్, 4 ప్యానెల్ డిస్కషన్స్ కూడా జరిపారు.