ఐఎండీ : హైదరాబాద్​లో రేపూ భారీ వర్షాలు

By udayam on May 4th / 7:13 am IST

బుధవారం తెల్లవారుఝాము నుంచి హైదరాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాలు గురువారం నాడూ కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు అత్యధికంగా సిద్దిపేట జిల్లాలోని హబ్సీపూర్​లో 108 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటతో పాటు జగిత్యాల, మంచిర్యాల, యాదాద్రి జిల్లాల్లోనూ భారీగా వర్షం కురిసింది. మే 5న ఎపిలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ట్యాగ్స్​