ఆ రాష్ట్రాల సరిహద్దుల్ని మూసేయనున్న తెలంగాణ?

By udayam on April 14th / 6:20 am IST

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిపై బ్యాన్​ విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొంత మంది నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు పంపారు. మహారాష్ట్ర నుంచి వైద్యం నిమిత్తం హైదరాబాద్​కు వస్తున్న వారి వల్ల ఇప్పటికే ఆసుపత్రుల బెడ్లు నిండిపోతున్నాయని, దాంతో అలాంటి వారిపై ముందుగా బ్యాన్​ విధించాలని నిపుణులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.

ట్యాగ్స్​