జాతీయ మహిళల బాక్సింగ్​ ఛాంప్​ గా నిఖత్​ జరీన్​

By udayam on December 26th / 12:14 pm IST

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌… జాతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచి 2022వ ఏడాదిని ఘనంగా ముగించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ వేదికగా జరిగిన 6వ జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సత్తా చాటింది. ఫైనల్‌లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌… ప్రత్యర్థి అనామిక(రైల్వేస్‌)కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 4-1 తేడాతో గెలుపొందింది. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన నిఖత్‌ కు అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బౌట్‌ను గెలిచినప్పటికీ అనామికకు నిఖత్‌ చేతిలో ఓటమి తప్పలేదు.

ట్యాగ్స్​