పరీక్షల్ని రద్దు చేయాలంటూ పిటిషన్​

By udayam on April 14th / 6:05 am IST

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా టెన్త్​, ఇంటర్​ పరీక్షల్ని రద్దు చేయాలంటూ విద్యార్ధులు ఆన్​లైన్​ పిటిషన్​ పెట్టారు. ఇప్పటికే ఈ పిటిషన్​కు 12 వేల మంది విద్యార్ధులు సంతకాలు పెట్టారు. సిలబస్​ విషయంలో ఎలాంటి గైడెన్స్​ లేదని, పైగా తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఈ పిటిషన్​లో విద్యార్ధులు పేర్కొన్నారు. ఎలాంటి క్వశ్చన్స్​ వస్తాయో తెలియకుండా పరీక్షలు రాయడం సరికాదన్న విద్యార్ధులు మే 17 నుంచి 22 వరకూ జరగనున్న టెన్త్​ పరీక్షలతో పాటు ఇంటర్మీడియెట్​ పరీక్షల్ని సైతం రద్దు చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్​