డెంగీ కేసులు తెలంగాణలోనే అధికమట

By udayam on December 27th / 5:15 am IST

దేశవ్యాప్తంగా డెంగీ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. జాతీయ సగటు 3,068 తో పోల్చితే ఈ ఏడాది తెలంగాణలో 13,091 కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్కరు కూడా డెంగీ వ్యాధితో మన రాష్ట్రంలో మరణించకపోవడం గమనార్హం. గతేడాది తెలంగాణలో కేవలం 7,135 డెంగీ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ తర్వాత ఈ ఏడాది బీహార్ 9,374 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఇంటి చుట్టుపక్కల చెత్తను శుభ్రం చేసుకోవడం లాంటి చిన్న చిన్న అలవాట్లతో డెంగీని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్​