పద్మశ్రీ వనజీవి రామయ్య భద్రాద్రి జిల్లా ఖమ్మంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం ఉదయం పల్లెగూడెంలోని మొక్కలకు నీళ్ళు పోసేందుకు స్కూటర్‌పై వెళ్తుండగా ఆయనను మరో బైక్ ఢీకొట్టింది. దీంతో కింద పడ్డ ఆయన తలకు గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. 2019లోనూ ఆయనకు రోడ్డు ప్రమాదం జరగింది. ఆపై కాస్త కోలుకుని స్వయంగా ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు.