టిఎస్​ సర్కార్​: 18 నాటికి సచివాలయం పూర్తి కావాలి

By udayam on January 3rd / 10:25 am IST

తెలంగాణ సచివాలయ నూతన ప్రాంగణ నిర్మాణం తుది దశకు చేరుకుంది. జనవరి 18వ తేదీలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పటికి భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చని అంచనా. 18న పూజలు నిర్వహించేందుకు వీలుగా కొంత భాగాన్ని సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), రెండు మూడు మంత్రిత్వ శాఖల మంత్రుల కార్యాలయాల పూర్తికి కసరత్తు సాగుతోంది. వీరి కార్యాలయాలు ఇప్పటికే 90 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. భవనం పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్​