18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనికోసం న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్న ఆమె కేన్సర్ తో తాను పోరాడతానని మార్టినా ప్రకటించారు. మార్టినా 2010లోనే బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆమె శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు మరోమారు ఆమెను కేన్సర్లు చుట్టుముట్టాయి. అయితే, ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయని, కోలుకుంటానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు.