ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తన మోడల్ 3, వై ఎక్స్, ఎస్ వేరియంట్లలో తలెత్తిన టచ్ స్క్రీన్ ప్రాబ్లెమ్పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.30 లక్షల కార్లను వెనక్కి పిలిచి ఉచిత రిపేర్ చేయడానికి ఓకే చెప్పింది. 2021, 2022 మోడళ్ళ కార్లలో ఈ సమస్య వస్తోందిన ది వెర్జ్ రిపోర్ట్ చేసిన వెంటనే టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. కార్లోని సిపియు ఓవర్ హీట్ కావడంతో టచ్ స్క్రీన్లు పనిచేయకుండా పోతున్నట్లు టెస్లా ఒప్పుకుంది.