తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ పలువురు కోలీవుడ్ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై టిఎఫ్పీసీ సెక్రటరీ ప్రసన్న కుమార్ స్పందించారు. ‘2023 సంక్రాంతి రిలీజ్‌ల విషయంలో తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకేనని పేర్కొంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని..మిగిలిన థియేటర్స్‌ను డబ్బింగ్ చిత్రాలకు కేటాయించాలని అందులోని సారంశం. అంతేకానీ డబ్బింగ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తామని, ఇక్కడ ఆడనివ్వమని ఆ ప్రకటనలో ఎక్కడా చెప్పలేదు.